డ్వాక్రా మహిళలు ఉద్యోగాల్లో ఎలా చేరాలి వారికి జీతం ఎంత ఇస్తారు

డ్వాక్రా మహిళలు ఉద్యోగాల్లో ఎలా చేరాలి వారికి జీతం ఎంత ఇస్తారు

0
219

మన దేశంలో డ్వాక్రా అంటే అందరికి తెలుసు, ఏ దేశంలో ఈ విధంగా ఈ పథకం అమలు చేయడం లేదు .. మహిళలు తమ స్వశక్తితో ఎదిగేందుకు ఈ డ్వాక్రా సంఘాలు మరింత ఊతం ఇస్తున్నాయి అని చెప్పాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గుతున్న మహిళలకు ఆర్థికచేయూత అందించేందుకు 2010లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ నిధి పథకాన్ని ప్రారంభించింది. అప్పుడు మైక్రో ఫైనాన్స్ కంపెనీల బెడద లేకుండా దీనిని తీసుకువచ్చారు.

ఒక్కో గ్రూపులో 10 మంది మహిళలు సభ్యులుంటారు. ఒక్కో సభ్యురాలు నెలసరి పొదుపు కింద రూ. 100, ఆరోగ్య పొదుపు కింద రూ. 10, సమైక్య పొదుపు కోసం రూ. 10 చొప్పున గ్రూపు లీడర్లకు చెల్లించాలి. ఆరు నెలలు నిండిన ప్రతి గ్రూపు రుణం పొందేందుకు అర్హత సాధిస్తుంది. రుణం పొందిన సభ్యురాళ్ల నెలసరి వాయిదాలను కూడా లీడర్లే వసూలు చేసి, తమ బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది.

ఒక్కో ఆర్పీ పరిధిలో 20 నుంచి 30 మహిళా సంఘాలుంటాయి. వీరంతా నెలనెలా కొంత మొత్తం పొదుపుచేయడంతో పాటు ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకుంటూ సొంత వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మరి డ్వాక్రా గ్రూప్ మెంబర్ ని ఎలా తీసుకుంటారు అనేది చూస్తే

ఏరియాలో ఆర్పీ అనే సభ్యుడిని తీసుకుంటారు వీరు కచ్చితంగా 10 వ తరగతి చదివి ఉండాలి. వీరు గ్రూపు లీడర్స్ గా ఉంటారు…ఆ ఏరియా మహిళ అయి ఉండాలి…కనీసం వారికి మొబైల్ కచ్చితంగా వాడే అనుభవం ఉండాలి…అలాగే తెలుగులో అయినా రాసేలా రైటింగ్ నాలెడ్జ్ ఉండాలి…పది గ్రూపులకి ఓ మెంబర్ ఉంటారు.. యానిమేటర్స్ దగ్గర ఈ వ్యక్తిని ప్రపోజ్ చేస్తారు….గ్రూపులో యాక్టీవ్ మెంబర్స్ ని సెలక్ట్ చేసుకుంటారు…అలా ఆర్పీలుగా మెంబర్లే అవుతారు వారికి నెలకు మూడు వేల రూపాయలు బ్రుతి ఇస్తారు, ఇప్పుడు వీరికి మరింత జీతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు.