మహేష్ మేనల్లుడి సినిమాలో జగపతిబాబు

మహేష్ మేనల్లుడి సినిమాలో జగపతిబాబు

0
87

జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం అదిరిపోతోంది… హీరోగా చేసిన సినిమాల కంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయనకు ఎంతో పేరు వచ్చింది .. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రతినాయకుడిగా, ఫాదర్ గా, మావయ్యగా, పలు సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి, భారీ బడ్జెట్ చిత్రాల్లో పెద్ద తరహ పాత్రలు ఆయన చేస్తున్నారు.

తాజాగా ఆయనను మరోసారి కీలకపాత్ర వరించింది. ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారట.

దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే ఆయనని సంప్రదించి కాల్షీట్లు తీసుకున్నారు, ఇక నేటి నుంచి హైదరాబాద్ లో జరిగే షూటింగ్ లో ఆయన పాల్గొంటారు.. గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. గల్లా జయదేవ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తున్నారు.