గీత గోవిందం సినిమా సక్సెస్ తో ఆ దర్శకుడు పరశురామ్ పేరు బాగా పరిచయం అయింది. ఆ వెంటనే ఆయన తదుపరి సినిమా ఉంటుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు .. సుమారు సంవత్సరం పైనే ఆయన ఇంకా ఏ సినిమా స్టార్ట్ చేకుండా ఉన్నారు.. పలువురికి కధలు వినిపిస్తున్న ఆయన వారి కాల్షీట్ల కోసం టైం వదిలేశారు అనేది టాలీవుడ్ టాక్.
తాజాగా మొత్తానికి ఆయన తదుపరి సినిమా నాగచైతన్యతో వుండనుందనే వార్త ఇటీవల బయటికి వచ్చింది. ఆ తరువాత సినిమా మహేశ్ బాబుతో వుండనుందనేది తాజా సమాచారం. ఈ విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలపై పరశురామ్ స్పందించాడు. మహేశ్ బాబుతో తన సినిమా ఉంటుందని స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనులతో బిజీగా వున్న మహేశ్ బాబు, ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే మహేశ్ బాబు – పరశురామ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.
అంటే కచ్చితంగా 2020 లో వంశీ చిత్రం పూర్తి అయిన తర్వాత పరశురామ్ తో ప్రాజెక్ట్ చేస్తారు బహుశా దీపావళి సమయంలో సినిమా స్టార్ట్ చేయవచ్చు, ఇక చైతూతో సినిమా అవ్వగానే ప్రిన్స్ తో ఆయన సినిమా వర్క్ కి కథ అంతా సిద్దం చేసుకుంటారు అని తెలుస్తోంది.