ప్రశాంత్ కిషోర్ నాకు తెలియదు కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్

ప్రశాంత్ కిషోర్ నాకు తెలియదు కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్

0
85

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు తెలియనివారు ఉండరు, చాలా మంది రాజకీయ నేతలకు పార్టీలకు ఆయన కన్సెల్టెంట్ గా రాజకీయాలలో ఎన్నికల వ్యూహకర్తగా వర్క్ చేశారు , గెలుపు గుర్రాలను సెలక్ట్ చేయడంలో ఆయన కింగ్ అనే చెబుతారు, అక్కడ ప్రధాని నరేంద్రమోదీకి గతంలో ఆయన వర్క్ చేశారు, అలాగే నితిష్ ని సీఎం చేయడంలో జగన్ సీఎం అవ్వడంతో ఆయన పాత్ర ఉంది.

తాజాగా ఆయన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆయన పనిచేస్తున్నారు. ఈ సమయంలో తనకు ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలియదు అంటూ కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో మీడియా కూడా, వెంటనే ఆయన గతంలో మీ గెలుపు కోసం పనిచేశారు మీరు తెలియదు అంటే ఎలా అని ప్రశ్నించింది.

దీనికి వెంటనే కేంద్రమంత్రి ఘాటు రిప్లై ఇచ్చారు.2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఆయన పనిచేశారు. అనేక వ్యూహాలతో బీజేపీని అందలం ఎక్కించారు అని ప్రశ్నించగా. అప్పట్లో తాను బీజేపీలో లేనని, కాబట్టి ఆ విషయం తనకు తెలియదని తేల్చి చెప్పారు. దీంతో మీడియా కూడా సైలెంట్ అయింది