పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పింక్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే ..వచ్చే ఏడాది అంటే 2020 కి ఈ సినిమా పట్టాలెక్కనుంది, అయితే ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు, ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ కల్యాణ్ మరో సినిమాని కూడా చేయనున్నారట వచ్చే ఏడాది.
అవును క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారని కూడా వార్తలు వినపడుతున్నాయి. క్రిష్ ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశారట. లేటెస్ట్ సమాచారం మేరకు పవన్, క్రిష్ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించనున్నారట.
ఈ సినిమా గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని టాక్. మొత్తానికి ఈ సినిమాపై కూడా భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు.. అయితే ఫ్యాన్స్ కు మాత్రం ఎలాంటి నిర్ణయం ఇంకా పవన్ నుంచి రాలేదు. ఆయన సినిమాలు చేస్తారా లేదా రాజకీయాల్లోనే ఉంటారా అనేది కూడా వచ్చే ఏడాది క్లారిటీ ఇవ్వనున్నారు.