దేనిమీద అయినా, ఏ అంశం గురించి అయినా మాట్లాడాలి అంటే దర్శకుడు వర్మ తర్వాతే ఎవరైనా.. తాను అనుకున్నదే చేస్తాడు వర్మ.. ఎవరి మాట అస్సలు వినరు, తనకు నచ్చిన పందాలోనే వెళతారు, ఇక తాజాగా ఏపీ రాజకీయాలపై సినిమా తీసి సంచలనం క్రియేట్ చేశారు.. మరో సినిమాతో ఆయన బిజీగా ఉన్నారు.
అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజధానిపై స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని అన్నారు. తనవరకు రాజధాని పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా పట్టించుకోనని స్పష్టం చేశారు. రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి? అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన వర్మ,
ప్రజలకు నేరుగా పాలన అందించడం కోసమే రాజధాని అనుకుంటే, ప్రతి నగరంలో ఓ రాజధాని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అయితే వర్మ చెప్పిన సమాధానం పై అందరూ సూపర్ అంటున్నారు, మరికొందరు వర్మ క్లారిటీగా చెప్పలేదు అంటున్నారు, మొత్తానికి దర్శకుడు వర్మ చెప్పిన దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.