ఎస్ బీ ఐ సంచలన నిర్ణయం జనవరి 1 నుంచి అమలు అందరూ తెలుసుకోండి

ఎస్ బీ ఐ సంచలన నిర్ణయం జనవరి 1 నుంచి అమలు అందరూ తెలుసుకోండి

0
81

మన దేశంలో జాతీయ బ్యాంకుల్లో అతి పెద్ద బ్యాంకు ఎస్ బీ ఐ అనేది తెలిసిందే… ఖాతాదారులకు నిత్యం కొత్త కొత్త స్కీమ్స్ తీసుకురావడమే కాదు చాలా వరకూ వడ్డీ తక్కువకు రుణాలు ఇవ్వడంలో కూడా దానికి సాటే లేదు.. అయితే ఎస్ బీ ఐ బ్యాంకు నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి, ఇప్పటికే ఏటీఎంలను తగ్గించుకునే పనిలో పడుతోంది ఎస్ బీఐ.

అలాగే ఆర్ బీ ఐ రూల్స్ ప్రకారం డైలీ విత్ డ్రాయల్ లిమిట్స్ ఏటీఎంలలో తగ్గించారు, ఒకేసారి 50 వేలు వచ్చే సౌకర్యాలు కూడా ఆగిపోయాయి, అయితే పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు చాలా వరకూ ఏటీఎంలలో డబ్బులు బయటకు వస్తాయి. అయితే దీని వల్ల మోసాలు జరుగుతున్నాయి అందుకే ఎస్ బీ ఐ కొత్త నిర్ణయం అమలు చేయనుంది.

ఇకపై ఎటీఎంల నుంచి రూ.10 వేల కన్నా ఎక్కువ నగదు తీసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయడం తప్పనిసరి అని తెలియచేసింది. బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే నగదు బయటికి వస్తుంది. ఓటీపీ ఆధారిత క్యాష్ విత్ డ్రా సేవలు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వచ్చే రోజుల్లో 24 గంటలు దీనిని అమలు చేసే ఆలోచనలో ఉంది బ్యాంకు.