దిశ కేసు ఫైనల్ దశకు చేరిపోయింది.. ఇక ఆ నిందితుల కాల్పుల ఘటన కేసు పై పోలీసులు విచారణ ఎదుర్కొంటున్నారు,అయితే ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు నిందితులకు చివరి కార్యక్రమాలు అంతిమ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వారికి ప్రభుత్వం నుంచి సాయం చేయాలి అని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో చెన్నకేశవులు తండ్రికి ప్రమాదం జరిగింది, ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సైబరాబాద్ ఏసీపీ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలో జరిగింది. చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య అలియాస్ కూర్మప్ప తన స్వగ్రామమైన గుడిగుండ్ల నుంచి బండిపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. కూర్మయ్యను ముంద మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఈ ప్రమాదం తరువాత ఆ పోలీసు అధికారిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేశారన్న సెక్షన్ పై కేసు నమోదు చేశామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అయితే ఆ కుటుంబానికి వరుసగా షాక్ లు తగలడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.. పొట్ట చేతపట్టుకుని కూలి పనుల కోసం వెళతామని, ఆ దేముడు మా కుటుంబానికి ఇలాంటి శిక్షలు విధిస్తున్నాడు అని కన్నీరు మున్నీరు అయ్యారు.