ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.. ఇక రైల్వే ఉద్యోగం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని ఎగిరి గంతేస్తారు, అయితే చాలా మంది ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, తాజాగా భారతీయ రైల్వేలో నియామక ప్రక్రియ మారబోతోంది. భారతీయ రైల్వే వ్యవస్థాగత మార్పులు, పునర్నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
అందులో రైల్వేలో నియామకాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. భారతీయ రైల్వేలో ప్రస్తుతం ఉన్న 8 గ్రూప్ ఏ సర్వీసుల్ని కలిపి ఒకే సెంట్రల్ సర్వీస్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చాలా మందికి ప్లస్ కాబోతున్న అంశం అంటున్నారు ఉద్యోగులు.
దీనిని ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్-IRMS. ఐఏఎస్, ఐపీఎస్‌లాగా ఐఆర్ఎంఎస్ నియామకాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐఆర్ఎంఎస్ నియామకాలు కూడా యూపీఎస్సీ పరిధిలోకే వస్తాయి. దీంతో కచ్చితంగా రైల్వే ఉద్యోగాల్లో చెప్పిన విధంగా నోటిఫికేషన్లు అలాగే ఇంటర్వ్యూలు టెస్టులు పరీక్షలు ఉంటాయి
యూపీఎస్‌సీ నిర్వహించబోయే ఐఆర్ఎంఎస్ కోసం అభ్యర్థులు మొదట ప్రిలిమ్స్ రాసి, ఆ తర్వాత ఐఆర్ఎంఎస్‌లో ఐదు స్పెషాలిటీస్‌లో ఒకటి ఎంచుకోవాలి. అందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, టెక్నికల్ స్పెషాలిటీస్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. నాన్ టెక్నికల్ పేరుతో మరో స్పెషాలిటీ ఉంటుంది. ఈ పోస్టు ద్వారా అకౌంట్స్, పర్సనల్, ట్రాఫిక్ విభాగాల అధికారులను నియమిస్తారు. ఇకపై రైల్వేలో కొత్త నియామకాలన్నీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ద్వారానే జరుగుతాయని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. సో రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారిక ఇది ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.