జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది ..తన పార్టీ తరపున స్టాండ్ ఆయన మీడియా ముఖంగా వినిపిస్తారు అని వార్తలు వస్తున్నాయి.. మూడు రాజధానుల ప్రకటనపై ఇప్పటికే వైసీపీ సర్కారుపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు జనసేనాని.
తాజాగా గత కొన్నిరోజులుగా అమరావతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. మంగళగిరిలో సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక నేడు జనసేన పార్టీ అధినేత వీరితో భేటీ కానున్నారు.
ముఖ్యంగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానంపై చర్చించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, పార్టీపరమైన కార్యక్రమాల షెడ్యూల్ పైనా చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇటీవల రాజధాని ప్రాంతంలో జనసేన కమిటి పర్యటించింది… వారి నివేదిక కూడా ఇవ్వనున్నారు, నేడు పవన్ ప్రకటన కీలకం కానుంది.