బీజేపీలో భిన్న స్వరాలు…

బీజేపీలో భిన్న స్వరాలు...

0
97

మూడు రాజధానులు విషయంలో ఏపీ బీజేపీ నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు విశాఖకు రాజధాని రావటాన్ని స్వాగిస్తున్నారు….

ఇక మరో వైపు సీఎం రమేష్ సుజనా చౌదరి వంటి వారు డిఫరెంట్ గా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది… ఇటీవలే సుజనా చౌదరి మూడు రాజధానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… కేంద్ర నాయకత్వంతో మాట్లాడిన తర్వాత తాను చెబుతున్నానని రాజధానిని తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు..,

ఇక సీఎం రమేష్ మాత్రం రాజధాని అంశం రాష్ట్రపరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు…. రాజధాని తరలింపు అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందే తప్ప జోక్యం చేసుకోదని అన్నారు…. ప్రస్తుతం బీజేపీ నాయకులు భిన్నంగా మాట్లాడటంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది…