నాగార్జునని ఆ మాట అన్నాను పరిగెత్తించారు-ఖుష్బూ

నాగార్జునని ఆ మాట అన్నాను పరిగెత్తించారు-ఖుష్బూ

0
76

షూటింగుల సమయంలో అనేక సరదా సన్నివేశాలు జరుగుతాయి.. అయితే చిత్ర యూనిట్ మధ్యనే కొన్ని మర్చిపోతారు మరికొన్ని మాత్రం బయటకు వస్తాయి.. అయితే సీనియర్ హీరోయిన్ ఖుష్బూతాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సమయంలో అనేక కొత్త విషయాలు చెప్పారు.
కెప్టెన్ నాగార్జున షూటింగు సమయంలో జరిగిన ఒక సరదా సంఘటనను గురించి తెలియచేశారు.

నాగార్జున హీరోగా కెప్టెన్ నాగార్జున షూటింగ్ ఏవీఎమ్ స్టూడియోలో జరిగింది. ఆ సమయంలో నాకు తెలుగు రాదు, తమిళ్ రాదు, డాన్స్ మాస్టర్ చిన్ని ప్రకాశ్ గారి అసిస్టెంట్ సతీశ్ ఉండేవారు. చెన్నైలో షూటింగ్ జరుగుతుంది కనుక, తమిళంలోనే గుడ్ మార్నింగ్ చెప్పాలని అన్నారు. ఆయన నాకు తమిళ్ లో గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలో నేర్పించారు.

అయితే ఆయన నాకు ఓ బ్యాడ్ వర్డ్ నేర్పించారు అని తర్వాత తెలిసింది, ఈ సమయంలో సెట్ లో నేను ఉన్నాను. అదే సమయంలో నాగార్జున కూడా షూటింగ్ కు వచ్చారు, నేను ఆయనకు ఇదే మాట తెలియక అన్నాను. ఆయనకు అర్దం అయింది నా దగ్గరకు వస్తున్న సమయంలో అక్కడ నుంచి పారిపోయాను అని నవ్వుతూ చెప్పారు ఖుష్బు ..ఇది చాలా సరదాగా తీసుకున్నాము అని చెప్పారు ఆమె.