పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు జనవరి 1 నుంచి అమలు ఎంతో తెలుసా

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు జనవరి 1 నుంచి అమలు ఎంతో తెలుసా

0
110

కొత్త ఏడాది రైల్వే చార్జీలు బాదింది రైల్వేశాఖ.. అయితే గ్యాస్ ధరలు మండిపోతున్నాయి.. నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్….14.2 కిలోలు) ధరలు వరుసగా ఐదో నెల కూడా పెరిగాయి..ప్రతీ నెలా గ్యాస్ రేటు ధరలు మారుతున్న విషయం తెలిసిందే.. మొదటి రోజు ధరలు నిర్ణయిస్తున్నాయి సంస్ధలు.. తాజాగా ఈ నెల గ్యాస్ ధర పెరిగింది.

తాజాగాపెరిగిన ధరలు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండర్ రూ.19 ముంబైలో రూ.19.5 చొప్పున పెరిగినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. గత నెల కంటే ఈ నెల 19 రూపాయలు గ్యాస్ ధర పెరిగింది.

ఢిల్లీలో సబ్సిడీయేతర సిలెండర్ ధర రూ.714కు, ముంబైలో రూ.684కు చేరింది. గత డిసెంబర్‌లో ఇదే సిలెండర్ ధర ఢిల్లీలో రూ.695గా, ముంబైలో 665గా ఉంది. కోల్‌కతాలో సిలెండర్ ధర రూ.21.5 చొప్పున పెరిగి రూ.747కు, చెన్నైలో రూ.20 పెరిగి రూ.734కు చేరింది.