ఈ మధ్య కాలంలో వచ్చిన ఎవరు సినిమా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె తమిళంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. జనవరి 2వ వారం నుంచి చెన్నై లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించనున్నాడు.
అయితే ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర చేస్తోందట భవిష్యత్తులో జరగబోయేవి ముందే చెప్పే పాత్రలో ఆమె కనిపిస్తుందట దీని చుట్టు సినిమా నడుస్తుంది అని అంటున్నారు. ఈ పాత్ర చాలా విలక్షణమైనది కావడంతో, తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని రెజీనా భావిస్తోంది.
ఈ సినిమా హిట్ కొడితే, లేడి ఓరియెంటెడ్ చిత్రాలు నాయిక ప్రధాన పాత్ర పోషించే చిత్రాలు ఆమెకు అనేకం వస్తాయి అంటున్నారు దర్శక నిర్మాతలు. అందుకే ఆమె ఈ చిత్రాన్ని ఒకే చేశారట.