మహేష్ బాబు చిన్నతనం గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయశాంతి

మహేష్ బాబు చిన్నతనం గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయశాంతి

0
82

నిజమే సినిమా ఇండస్ట్రీలో నాటి హీరోయిన్లు నేడు అక్కలు, అమ్మల పాత్రలు చేస్తున్నారు.. సినిమాలను వదలలేరు అది వాస్తవం.. సినిమా ప్రపంచంలో మంచి పాత్ర వస్తే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వాటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ఎందరో అగ్రతారలు తర్వాత అక్కలు తల్లులు పాత్రలు చేసిన వారే.

తాజాగా అలనాటి నటి విజయశాంతి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు.. ఇందులో మహేష్ బాబు లీడ్ రోల్ చేశారు… ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమా చూశానని, చాలా బాగా వచ్చిందని, ఈ చిత్రంలో తనది డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అని చెప్పారు.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా బాగా తీశారు అని, మంచి భవిష్యత్తు ఉంది అని తెలిపారు ఆమె.
ఈ సందర్భంగా 1988లో వచ్చిన కొడుకుదిద్దిన కాపురం చిత్రం గురించి ఆమె ప్రస్తావించారు. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేశ్ బాబు నటించాడని చెబుతూ, అందులో ఓ సన్నివేశం గురించి ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సినిమా షూటింగ్ లో భాగంగా మహేష్ బాబు చెంప పై తాను కొట్టాలి.

ఈ సమయంలో ఎంతో అందంగా ఉన్న మహేష్ ని కొట్టాలి అంటే బాధ అనిపించింది , చివరకు ఎన్నో టేక్స్ తీసుకుని ఆ సీన్ చేశాము అని చెప్పారు.. ఆ చిన్న పిల్లోడు ఈరోజు సూపర్ స్టార్ అనొ అన్నారు. నిజంగా ఇది గ్రేట్ మూవెంట్ అంటున్నారు ప్రిన్స్ అభిమానులు.