ఓ పక్క స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూనే ఇటు చిత్ర నిర్మాణ రంగంలో ఉంటున్నారు.. అలాగే పాన్ ఇండియా లెవల్ వ్యాపారాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మహేష్ బాబు రామ్ చరణ్ ముందు వరుసలో ఉంటారు అనేది తెలిసిందే, తాజాగా కుర్ర కారులో క్రేజ్ సంపాదించుకున్న హీరో
విజయ్ దేవరకొండకు కూడా మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి.. చేతినిండా సినిమాలు ఉన్నాయి.. మరో మూడు సంవత్సరాల వరకూ విజయ్ కు బ్రేక్ లేదు.
విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇప్పటికే రౌడీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడని తెలుస్తోంది. మరి విజయ్ స్టార్ట్ చేయనున్న వ్యాపారమేంటో తెలుసా? మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్. చాలా మంది హీరోలు స్టార్ట్ చేస్తున్న బిజినెస్ కూడా ఇదే, తాజాగా విజయ్ ఏషియన్ సినిమాస్తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారట.
మహబూబ్ నగర్లో ఏవీడీ పేరుతో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ను స్టార్ట్ చేయబోతున్నారట. గత ఏడాది మహేశ్తో కలిసి ఏఎంబీ సినిమాను స్టార్ట్ చేసిన ఏషియన్ సంస్థ తాజాగా విజయ్ దేవరకొండతో చేతులు కలిపింది.. అయితే భారీస్ధాయిలో మల్టీ ఫ్లెక్స్ స్టార్ట్ చేస్తున్నారట ఈ సంస్ధతో.