చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసి మద్దాలి గిరి

చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసి మద్దాలి గిరి

0
83

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈ మేరకు చంద్రబాబుకు బహిరంగా లేఖ కూడా రాశారు… ఈ లేఖలోని సారాంశం…. తన నియోజకవర్గ సమస్యల దృష్ట్య తాను ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశానని అన్నారు….

ఒక రాష్ట్ర సీఎంను కలవడం తప్పేంటని అన్నారు… తాను సీఎంను కలిసినందుకు తన అనుమతి లేకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తరపున ఇంచార్జ్ ను నియమించారని ఆయన ఆరోపించారు… టీడీపీ కేవలం ఒక సామాజిక వర్గంకు మాత్రమే కొమ్ము కాస్తుందని అన్నారు…

జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే అందులో సుమారు 9 సీట్లు ఒక సామాజికవర్గానికే కేటాయించారని అన్నారు… విశాఖలో టీడీపీ నేతలు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నలుగురిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మద్దాలి ప్రశ్నించారు…

మాజీ కోడెల శివప్రసాద్ వంశీ నియోజకవర్గాలలో ఇంతవరకు ఎందుకు ఇంచార్జ్ లను నియమించలేదని ఆయన ప్రశ్నించారు… తాను ముఖ్యమంత్రిని కలిశాననే ఉద్దేశంతో తన అనుమతి లేకుండా ఇంచార్జ్ ను నియమించారని ఆయన ఆరోపించారు…