ఏపీలో ఉగాదికి పేదలకు అందరికి ఇళ్లు కల్పించే దిశగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.. ఉగాదికి సుమారు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని భావిస్తున్నారు, ఇక అమ్మఒడి రేషన్ పించన్లకు సంబందించి ఈ నెల అంతా ఈ కార్డుల డిస్టి బ్యూషన్ జరుగుతోంది, ఇక ఇళ్ల పట్టాల గురించి
కొత్తగా ఓ ప్రకటన అయితే ఇస్తున్నారు అధికారులు ముఖ్యంగా రెండు అప్లికేషన్లు అందించారు, వాటిలో మీరు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ముందుగా ఆ లబ్దిదారుల పేర్లు వాటి పూర్తి వివరాలతో అది ఎలా పూర్తి చేయాలి అనేది చూద్దాం.
లబ్దిదారుని పేరు మహిళ పేరు రాయాలి అక్కడ.
ఇక ఆమెకు తండ్రి లేదా భర్త పేరు ఇవ్వాలి
ఆధార్ కార్డ్
రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి
మీ ఫోటోలు రెండు ఇవ్వాల్సి ఉంటుంది
అలాగే మీది ఏ కులం. ఉపకులం కూడా ఇవ్వాలి.
అలాగే మీకు గతంలో ఇళ్లు ఉందా అది మీ పేరున ఉందా లేదా వేరే వారి పేరున ఉందా అనేది తెలియచేయాలి
ఇక మీ వార్షిక ఆదాయం ఎంత వస్తుందో కూడా తెలియచేయాలి
మీకు స్ధలం ఉంటే అది ప్రభుత్వం ఇచ్చిందా, లేదా మీరు సొంతంగా కొనుక్కున్నదా ఇవ్వాల్సి ఉంటుంది
ఇక మీరు ఉండే ఇళ్లు పూరి పాక, రేకుల షెడ్, డాబా బిల్డింగ్ అనేది తెలియచేయాలి
ఇక మీ ఇళ్లు ఎన్ని గజాలు
ఎక్కడ మీకు ఇళ్లు ఉంది మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇలా పూర్తి చేసిన అప్లికేషన్ గ్రామ వాలంటీర్ కు అందించండి.