వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆమె నిలుస్తారు.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు.. మీటూ ఉద్యమం పేరుతో టాలీవుడ్ లో కొందరని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి… తాజాగా చెన్నైలో వెళ్లి అక్కడే సెటిల్ అయింది.. అయితే అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలతో హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ తెలుగు ప్రజలకు దూరంగా లేను అని చెబుతున్నారు .. అలాగే పలు సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె చెన్నైలోని కోయంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్భనగర్ లోని ఒక ప్లాట్ లో ఉంటున్నారు. అయితే.. ఆమె ఇంటి ముందు ఒక వెబ్ సిరీస్ కుసంబంధించిన షూటింగ్ జరుగుతోందట. ఈ యూనిట్ చేస్తున్న గోలకు తాను ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది.
తన ఇంటి సమీపంలో వాహనం ఒకటి ఆపి ఉండటంతో తాను దాన్ని పక్కకు తీయించానని చెప్పింది.. ఆ తర్వాత తన ఖరీదైన ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం చేశారని చెబుతోంది. అయితే శ్రీరెడ్డి వారికి కారు తీయమని చెప్పిన తర్వాతే ఆమె కారుపై గీతలు పెట్టారట.. దీంతో తన కారుకి డ్యామేజ్ అయింది అని ఆమె పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. అభిమానులు మాత్రం అయ్యో అంటున్నారు.