చమ్మక్ చంద్ర స్కిట్లలో ఉండే లేడీ ఆర్టిస్ట్ సత్య గురించి మీకు తెలుసా ఆమె ఎవరో

చమ్మక్ చంద్ర స్కిట్లలో ఉండే లేడీ ఆర్టిస్ట్ సత్య గురించి మీకు తెలుసా ఆమె ఎవరో

0
157

జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్ర అంటే ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు… అయితే ఇప్పుడు జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి జీ తెలుగులో అదిరింది షో చేస్తున్నారు.. అయితే చంద్ర స్కిట్స్ అంత నవ్విస్తాయంటే దానికి కారణం ఆయన టీంలో ఉండే సత్తిపండు అలాగే లేడీ క్యారెక్టర్ సత్య .
వీరు స్కిట్ చేస్తే సూపర్ అనాల్సిందే.. చంద్ర స్కిట్లో ఉండే లేడీ ఆర్టిస్ట్ సత్య కూడా ఆయనతో పాటే అద్బుతంగా నటిస్తుంది.

చంద్ర టీమ్ లో సత్య స్కిట్లకు చాలా ప్లస్ అయింది అని చెప్పాలి. డాన్సులు యాక్టింగ్ సూపర్ చేస్తుంది.. ఇప్పుడు చమ్మక్ చంద్ర అదిరింది షో చేస్తున్నారు, దీంతో చంద్రతో పాటు ఆ టీమ్ కు సత్య వెళ్లింది . అయితే ఆమె జబర్ధస్త్ కు రాకముందు పది షార్ట్ ఫిలిమ్స్ చేసింది.. అంతేకాదు రాజా ది గ్రేట్ చిత్రంలో కూడా నటించింది. ఇంకా ఆమెకు మరో మూడు చిత్రాల్లో అవకాశం వచ్చింది ఆ సినిమాల్లో నటించేందుకు ఈ ఏడాది ఒప్పందం కుదుర్చుకుందట.

ఇటీవల వచ్చిన ఆర్డీఎక్స్ లవ్ మూవీలో నటించింది. మంచి పాత్ర చేయడంతో ఆమెకు ఈ సినిమాలో మరింత గుర్తింపు వచ్చింది.
ఒకవైపు టీవీ షో మరో వైపు ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తోంది. ఇటీవల సత్య ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది, ఆ సాంగ్ జనవరి 1 న రిలీజ్ అయింది. అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మంచి నటన స్కిట్లలో చేయడంతో జబర్ధస్ద్ నుంచి ఆమెకు అదిరింది నుంచి ఆఫర్ వచ్చిందట.