చాలా మంది రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ లేకుండా నడుపుతూ ఉంటాయి.. ఇలాంటి సమయంలో పోలీసులు చెక్ చేసిన సమయంలో వారు సరైన పత్రాలు లేకుండా దొరికిపోతారు.. ఇప్పటి వరకూ ఫైన్లు మాత్రమే విధిస్తున్న పోలీసులు ఇకపై వారికి షాక్ ఇవ్వనున్నారట ఆంధ్రప్రదేశ్ లో.
ఏపీ రవాణాశాఖ ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే ఇకపై నేరుగా జైలుకే పంపాలని నిర్ణయించింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 88,872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. అయితే అంతకంతకు పెరుగుతున్నారు కాని ఈ జాబితా తగ్గడం లేదు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది తాజాగా సుప్రీం కోర్టు.
ఈ నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని నిర్ణయించిన రవాణా శాఖ.. రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై ఎవరైనా పట్టుబడితే వారికి ఫైన్ వేయ్యం అని నేరుగా జైలుకి పంపిస్తాం అని చెబుతున్నారు పోలీసులు రవాణాశాఖ అధికారులు.. యువత ఇష్టం వచ్చినట్లు లైసెన్స్ లేకుండా బైక్ నడపవద్దని ప్రమాదాలకు కారణం అవ్వద్దు అని చెబుతున్నారు.