మరో సారి ప్రపంచ వ్యాప్తంగా యుద్ద వాతావరణం, రెండు దేశాల మధ్య చర్చకు కారణం అవుతోంది.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై అమెరికా రాకెట్ దాడులు చేసింది, అయితే దీనికి తగిన మూల్యం అమెరికా చెల్లించుకుంటుంది అని కచ్చితంగా దాడి ఉంటుంది అని ఇరాన్ ఇరాక్ తెలియచేశాయి.. అయినా మరోసారి అమెరికా దాడి చేసింది.
దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పర్యవసానంగా విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత్ కూడా విమానాల విషయంలో ఆచితూచి ప్రయాణాలు ఆ రూట్లో కొనసాగించాలి అని చూస్తోంది.
ఇరాన్ గగనతలానికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. దీంతో ఎయిరిండియా, ఇండిగో వంటి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. భారత్ నుంచి అమెరికా, పశ్చిమాసియా, యూరప్ వెళ్లే విమానాలను విమానయాన సంస్థలు తాత్కాలికంగా దారి మళ్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి మాత్రం విమానయాన సంస్దలకు భారం మాత్రం అధికం కానుంది, మరోవైపు అమెరికా కూడా అటువైపు తమ దేశ విమానాలు పంపడం లేదు, అలాగే అమెరికా పౌరులని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని చెబుతోంది.