ప్రియమణి చిరకాల కోరిక బయటపెట్టింది ఏంటో చూడండి

ప్రియమణి చిరకాల కోరిక బయటపెట్టింది ఏంటో చూడండి

0
85

తెలుగులో కథానాయికగా ప్రియమణి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది, ఆమె నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి.. ఫ్యామిలీ హీరోయిన్ గా పలు సినిమాల ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది..తెలుగుతో పాటు తమిళ్ లోని పలు సినిమాల్లో నటించింది.

ఇప్పుడు పలు షోలలో నటిస్తూ అలాగే మంచి పాత్ర వస్తే సినిమాలు చేస్తోంది, అలాగే ప్రస్తుతం వెబ్ సిరీస్ ల తోను .. రియాలిటీ షోలతోను ఆమె బిజీగా వుంది. తెలుగులో రీమేక్ కానున్న అసురన్ లో కథానాయికగా ఆమె ఎంపికైంది. వెంకటేష్ ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.నటిగా వెండితెరకి పరిచయమై 17 ఏళ్లు అయింది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే సంతోషంగానే వుంది. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా మీ డ్రీమ్ రోల్ ఏమిటి?’అని అడుగుతున్నారు. పడయప్పా (నరసింహా)లో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి తరహా పాత్రను చేయాలనుంది.
ఆ పాత్ర ఏ సినిమాలో వచ్చినా చేస్తా అని చెప్పింది ప్రియమణి… తన ఫ్రెండ్ అందరూ కూడా నువ్వు నెగిటీవ్ షేడ్స్ చేసినా నీ వాయిస్ బాగుంటుంది అంటారు.. అందుకే ఆ పాత్ర చేయాలి అని ఉంది అని చెప్పింది ప్రియమణి.