మూడు రాజధానుల విషయంలో వైసీపీ రాష్ట్రపతికి లేఖ

మూడు రాజధానుల విషయంలో వైసీపీ రాష్ట్రపతికి లేఖ

0
77

మూడు రాజధానుల విషయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతికి లేఖ రాశారు… అమరావతిని రాజధానిగా నిర్ణయించడం రాజ్యాంగానికి విరుద్దంగా ప్రకటించాలని కోరారు…

రాజ్యంగం సూచించిన మేరకు పరిపాలన వ్యవహారాలు సాగాల్సి ఉందని అన్నారు… రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్ణయంతోపాటు ఇతర అంశాలను అద్యాయనం చేసేందుకు శివరామ కృష్ణకమిటీని నియమించారని తెలిపారు…

అయితే… ఈ కమిటీని అప్పటి టీడీపీ పాలకులు పరిగణలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు.. పార్టీ నాయకులతో కమిటీ వేసి రాజధానిగా అమరావతిని నిర్ణయించారని ధర్మాన తెలిపారు… రాజధానిని ఒకే చోట ఏర్పాటు చేయాలనుకున్నా గుంటూరు తెనాలి మంగళగిరి ప్రాంతాలు ఏర్పాటు చేయవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా తెలిపిందని కానీ దాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు…