బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలి అనేంతగా కష్టపడుతోంది.. టీఆర్ ఎస్ పార్టీపై తాము పోరాటం చేస్తున్నాము అని మేమే ప్రతిపక్ష నేతలం అనేలా దూసుకుపోతున్నారు.. మరో శక్తిగా బీజేపీ అవతరిస్తోంది తెలంగాణలో.. అయితే తాజాగా ఇక్కడ పార్టీలో నేతల చేరికలపై కూడా ఫోకస్ చేశారు కమలం పెద్దలు.. అందులో భాగంగా సీనియర్ నాయకుడు మోత్కుపల్లి తెలంగాణ నుంచి కీలక నాయకుడు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. నడ్డా ఆయనకు బీజేపీ సభ్యత్వ రశీదు అందజేశారు. ఈ ఉదయం ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి బీజేపీ అగ్రనేత నడ్డాను కలిశారు. ఆయన వెంట తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు తదితరులున్నారు.
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగారు మోత్కుపల్లి… తర్వాత పార్టీనుంచి బయటకు వచ్చారు.. ఆయన టీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరుతారు అని వార్తలు వచ్చాయి… కాని తాజాగా ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆయనకు తెలంగాణలో కీలక పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట కాషాయ పార్టీ పెద్దలు.