చేపఖరీదు 13 కోట్లు దాని స్పెషల్ చూడండి

చేపఖరీదు 13 కోట్లు దాని స్పెషల్ చూడండి

0
106

ప్రపంచవ్యాప్తంగా చేపల్లో బాగా ఫేమస్ అంటే టూనా చేపల పేరు చెబుతారు ఎవరైనా.. అవును ధర చాలా ఎక్కువగా ఉంటుంది. వరల్డ్ లో ఎక్కడ స్టార్ హోటళ్లలో చూసినా సెలబ్రిటీ డిష్ గా టూనా చేపల మాంసం చెబుతారు.. ఎంతో డిమాండ్ ఉంది వీటికి. వీటి సైజును బట్టి ధర పలుకుతుంటుంది. అయితే ఇవి దొరికినా అంత సులువుగా అమ్మలేరు చాలా రేర్ గానే కొంటారు వీటిని.

వంద కిలోల పైబడిన టూనా చేపలను వేలం వేస్తుంటారు చాలా చోట్ల. ఏకంగా కోట్లల్లో ధర పలికే టూనా చేపలను తినడాన్ని, తమ హోటల్ లో టూనా చేపల వంటకాలు దొరుకుతాయని చెప్పుకోవడాన్ని జపనీయులు గొప్పగా భావిస్తారు.. తాజాగా వేలంలో బ్లూఫిన్ టూనా చేప భారీ రేటు పలికింది అయితే ధర తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.

ఇది ఏకంగా 13 కోట్లకు అమ్ముడు అయింది. జపాన్ లోని సుషీ చెయిన్ రెస్టారెంట్ల ఓనర్ కియోషి కిమురా ఈ 267 కిలోల భారీ చేపను వేలంలో దక్కించుకున్నాడు. గతేడాది ఇంతకంటే బరువైన చేపను కూడా కిమురానే కొనేశాడు. అప్పుడు దాని ధర రికార్డు స్థాయిలో రూ.22 కోట్లు పలికింది. అయితే ఇది డిష్ కింద చేసి కిలో చేప మాంసం 40 లక్షల రూపాయలకు అమ్ముతారట. జనాలు ఎగబడి మీర కొంటారట.