సుదీప్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ వింటే షాకవుతారు

సుదీప్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ వింటే షాకవుతారు

0
111

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే, తనకి నచ్చిన వారికి విలువైన కానుకలు ఇస్తారు అనేది తెలిసిందే.. ఒక్కోసారి అవి కోట్ల రూపాయలు విలువైనవి కూడా అవుతాయి. తాజాగా ప్రముఖ దక్షిణాది నటుడు కిచ్చ సుదీప్ కూడా సల్మాన్ ఖాన్ గురించి గొప్పగా చెబుతున్నాడు. ఇంతకీ ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రభుదేవా డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్, కిచ్చ సుదీప్ నటించిన దబాంగ్-3 చిత్రం ఇటీవలే విడుదలై రికార్డుల మోత మోగించింది… ఇందులో కిచ్చ సుదీప్ పోషించింది విలన్ పాత్రే అయినా ప్రేక్షకుల నుంచి గుర్తింపు లభించింది. సల్మాన్ కు మంచి ఫేమ్ వచ్చింది.

ఇక రోజూ షూటింగ్ లో ఇద్దరు కలుసుకోవడం వల్ల సల్మాన్, సుదీప్ ల మధ్య స్నేహం ఏర్పడింది. తనతో పరిచయం ఉన్నవాళ్లనే ఖరీదైన చేతివాచీలు ఇచ్చి సర్ ప్రైజ్ చేసే సల్మాన్… ఈసారి సుదీప్ కు కూడా విలువైన బహుమతి ఇచ్చారు. ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ ఎం5 కారును సుదీప్ ఇంటి ముందు నిలిపి సర్ ప్రైజ్ చేశారు.
మార్కెట్లో ఈ కారు విలువ రూ.1.7 కోట్లు వరకు ఉంది. తనకు సల్మాన్ ఇచ్చిన గిఫ్ట్ చూసి సుదీప్ ఆశ్చర్యపోయారు. సల్మాన్ సుదీప్ ఇంటికి వెళ్లి ఈ కారు ఇచ్చినట్లు తెలుస్తోంది, సల్మాన్ కు థాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో స్పందించారు.