హైదరాబాద్ మెట్రో ఓ అద్బుతం అనే చెప్పాలి… గంటల పాటు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సులువైన ప్రయాణం హైదరాబాద్ లో నగర వాసులకు మెట్రో కల్పిస్తోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు, అన్ని చోట్లా కనెక్టవిటీ ఉండటంతో చాలా వరకూ మెయిన్ ప్రాంతాలు అన్నీ మెట్రో కవర్ చేస్తోంది, తాజాగా సంక్రాంతికి మరో గుడ్ న్యూస్ వినిపించనుంది మెట్రో.
సంక్రాంతి నాటికి కారిడార్-2 (జేబీఎస్ – ఎంజీబీఎస్) మార్గాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రయల్ రన్స్2019 నవంబరులో ప్రారంభించారు, ఇవి సక్సెస్ అయ్యాయి, 11 కి.మీ ఉన్న జేబీఎస్ – ఎంజీబీఎస్ మార్గంలో 40 రోజులకు పైగానే మెట్రో ట్రయల్ రన్స్ నిర్వహించారు. అన్నీ పరీక్షలు విజయవంతం అయ్యాయి అని తెలుస్తోంది.
మొత్తం ట్రయల్ రన్స్ లో ఇప్పటికే 17 రకాల పరీక్షలను చేపట్టారు. జనవరి 15 కల్లా సుమారు 45 రోజుల పాటు ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు. జనవరి 20 లోపు సీఎంఆర్ఎస్ సర్టిఫికెట్ ఇస్తుంది. దీంతో జనవరి 20 తర్వాత ఈరూట్ లో మెట్రో స్టార్ట్ అవుతుంది అంటున్నారు అధికారులు..ఇది రన్ అయితే మొత్తం 67 కి.మీ మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది అని చెబుతున్నారు అధికారులు.