టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విజయశాంతి అంటే అభిమానించే వారు చాలా మంది ఉన్నారు.. తెలుగులో కిలాడీ కృష్ణుడు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన విజయశాంతి, తర్వాత ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు, ఆమె సినిమాకి సైన్ చేస్తే చాలు నిర్మాతల పంట పండేది, ఆమె కోసం హీరోలు సినిమాలు ఆపుకున్న సందర్బాలు ఉన్నాయి, ఒకే ఏడాది 10 చిత్రాలు సైన్ చేసేది, అంతేకాదు లేడి ఓరియెంటెడ్ చిత్రాలను
టాలీవుడ్ లో ముందు ఆమె స్టార్ట్ చేశారు… ఇప్పుడు ఎందరో నటీమణులు ఆ పాత్రలు చేస్తున్నారు. గతంలో రాజకీయాల్లో బిజీ అయిన ఆమెతో సినిమాలు తీయాలి అని కొందరు దర్శకులు నిర్మాతలు అనుకున్నారు.
లేడి ఓరియెండెట్ చిత్రాలు అలాగే ఆమెకు మంచి రోల్ ఉన్న పాత్రలు కథలో రాసేవారు, కాని ఆమె చేయడానికి ఇష్టం చూపించేవారు కాదు,
చివరకు సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో నటిగా ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు. ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు,. ఈ సమయంలో విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు దర్శకుడిపై ..ఈ ఐదు నెలల షూటింగ్ సమయంలో తనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయని, ముఖ్యంగా దర్శకుడు అనిల్ ఐదు నెలల పాటు పెట్టిన నరకం ఎప్పటికీ మరిచిపోలేనని కొంత సరదాగా ఆమె వ్యాఖ్యానించారు. ఆయనకు నచ్చే విధంగా షాట్ వచ్చేవరకూ బాగా తీసుకునేవారని ఆయన బాగా యాక్ట్ చేసి చూపించేవారని ఆమె సరదాగా తెలియచేశారు.