ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు ఈ ఏడాది సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్దం అయ్యారు.. సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11 న విడుదల కానుంది.ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అలరించనుండగా, కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. అయితే దాదాపు చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తీసుకుని ఈ సినిమాలో విజయశాంతి నటించారు.. రాజకీయాల్లో బిజీగా ఉన్న రాములమ్మని ఒప్పించడానికి దర్శకుడు చాలా సార్లు ఆమె డేట్స్ అడిగారట.. చివరకు మంచి పాత్ర కాబట్టి ఆమె చేశారట.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మికకి ఎంత పారితోషికం వచ్చింది అని అనుకుంటే ఆమెకంటే కచ్చితంగా విజయశాంతికే ఎక్కువ ఇచ్చారు అని టాక్ వస్తోంది. అవును ఆమెకి దాదాపు కోటి రూపాయల వరకూ ఇస్తే , ఇటు విజయశాంతికి 2.5 కోట్లు పారితోషికం ఇఛ్చి ఉంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
విజయశాంతి రెండున్నర కోట్ల వరకూ వచ్చే ఉంటుంది అంటున్నారు అయితే ఆ రెమ్యునరేషన్ కూడా తక్కువే అని, ఆమె నటనకు ఆమె ఫేమ్ కు నాలుగు కోట్లు అయినా ఇవ్వచ్చు అని మరికొందరు సీనియర్లు అంటున్నారు.. అయితే వాస్తవంగా ఆమె కోటిన్నరకి ఓకే చెప్పారట. పెద్ద బ్యానర్ .. స్టార్ హీరో .. కీలకమైన పాత్ర .. తన రీ ఎంట్రీ ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజయశాంతి తన పారితోషికాన్ని తగ్గించుకున్నారట. దీంతో నిర్మాతలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట.