రాజధాని రైతులకి మద్దతు తెలిపిన టాలీవుడ్ సింగర్

రాజధాని రైతులకి మద్దతు తెలిపిన టాలీవుడ్ సింగర్

0
84

ఏపీలో మూడు రాజధానుల అంశం పై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి.. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం పై వెనక్కి తగ్గాలి అని కోరుతున్నారు రైతులు… పెద్ద ఎత్తున 30 గ్రామాల్లో రాజధాని రైతులు ఆందోళన బాటపట్టారు.. దాదాపు 33 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తే ఇప్పుడు మమ్మల్ని అడ్డంగా ముంచేస్తారా అని విమర్శించారు.

తాజాగా రాజధాని రైతులకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడిప్పుడే మద్దతు లభిస్తోంది. ఇప్పటికే హీరో నారా రోహిత్ సంఘీభావం ప్రకటించారు. తాజాగా సింగర్ స్మిత ట్విట్టర్ ద్వారా రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. దీంతో ఉండేకొలది మరింత మంది రాజధాని రైతుల వైపు ఉంటారు అని అంటున్నారు. ఇలా రాజధాని తరలిస్తాం అని చెప్పడం బాధాకరం.

రైతుల వేదన చూస్తుంటే గుండె పగిలిపోతోందన్నారు. రైతుల బాధ తట్టుకోలేనిదని చెప్పారు.వాళ్లను చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని స్మిత ఆవేదన వ్యక్తం చేశారు. వారికి దేవుడు న్యాయం చేయాలి అని ఆమె కోరుకున్నారు. మీ వెంట నేను ఉన్నాను అని రైతులకి తెలియచేశారు ఆమె.
.