తమిళనాడులోని సేలంలో నంబూర్ అనే గ్రామంలో ఓ గర్భిని ప్రసవవేదనతో బాధపడింది… రాత్రి 11 గంటలకు నొప్పులు వచ్చాయి, అయితే అప్పటికే ఇంట్లో సభ్యుల వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి చెప్పారు, సాయం కోసం వెంటనే రమ్మన్నారు.. వెంటనే 10 నిమిషాల్లో అంబులెన్స్ ఇంటికి వచ్చింది.. వారికి సాయం చేయడానికి వెంటనే ముగ్గురు వైద్య సిబ్బంది వచ్చారు. అయితే అది అడవి ప్రాంతం ఆ సమయంలో అడవి ప్రాంతం నుంచి హస్పటల్ కి ముందుకు వెళ్లాలి.
ఈ సమయంలో జోరుగా వాన కురుస్తోంది, అయితే అంబులెన్స్ వెళుతున్న మార్గంలో ఓ పెద్ద లారీ ఇసుక లోడ్ తో ముందుకు కదల్లేక అక్కడ ఆగిపోయింది, దీంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు, లారీ ముందుకు కదలలేదు.. అంబులెన్స్ డ్రైవర్ స్టాలిన్ ఒక కిలోమీటర్ వరకూ పరిగెత్తుకు వెళ్లి ఏమైనా వాహనం ఉంటే పిలుద్దాం అనుకున్నాడు..
కాని ఈ లోపే అందులో మహిళ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది, అయితే ఆమె కళ్లుమాత్రం తెరవలేదు.. దీంతో అందరూ కంగారు పడ్డారు.. ఇక అక్కడ నుంచి తల్లిబిడ్డని స్ట్రెచర్ పై తీసుకుని ముందుకు వెళ్లాడు.. అక్కడ నుంచి మరో అంబులెన్స్ ని రమ్మని పిలిచాడు.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అతను చేసినపనికి అక్కడ అందరూ ప్రశంసిచారు కలెక్టర్ నుంచి అవార్డు అందుకున్నాడు.