నిర్భయ దోషులను ఉరితీసే తలారి పవన్ ఎవరు ? ఆ కుటుంబం చరిత్ర

నిర్భయ దోషులను ఉరితీసే తలారి పవన్ ఎవరు ? ఆ కుటుంబం చరిత్ర

0
87

నిర్భయదోషులని ఉరితీసే వ్యక్తి పేరు పవన్ జల్లాద్, ఈ తలారి గురించి ఇప్పుడు మన దేశంలో అందరూ చర్చించుకుంటున్నారు.. తలారీ పవన్ జల్లాద్ వయసు 57 సంవత్సరాలు…తండ్రి, తాత, ముత్తాతలు కూడా జైళ్లలో తలారీలు పనిచేశారు, వారసత్వంగా వీరు తలారుగా పనిచేస్తున్నారు.

పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్ బ్రిటీష్ వారి పాలనలో జైల్లో తలారీగా పనిచేశారు అప్పట్లో భగత్ సింగ్ ని ఉరి తీశారు. పవన్ తాత కల్లూ ఇందిరాగాంధీ హంతకులతో పాటు కరడుకట్టిన ఖైదీలు రంగా, బిల్లాలను ఉరి తీశారు. ఇతని తండ్రి మమ్మూ కూడా 2011 మే 19వ తేదీ వరకూ ఉన్నాడు తర్వాత మరణించాడు, తర్వాత 2013లో పవన్ ను యూపీ జైళ్ల శాఖ తలారీగా నియమించింది.

అయితే పవన్ కు నెల జీతం 5 వేల రూపాయలు ఇస్తారు, అతను బట్టలు కూడా అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు,2013లో తీహార్ జైల్లో అఫ్జల్ గురును ఉరితీసింది కూడా పవన్ అంటారు…..2015 నాటి యాకుబ్ మెమన్ ఉరి కూడా పవన్ తీశాడు అంటారు.. అయితే ఈ ఉరి ఎవరు తీశారు అనేది కొన్ని భద్రతా కారణాల వల్ల బయటపెట్టరు పోలీసులు. తన కుమారుడ్ని మాత్రం తలారిగా కొనసాగించను అని చెప్పాడు పవన్ ..తనతో ఈ తలారి వంశం ఆగిపోతుంది అని తెలిపాడు పవన్.