రాజధాని రైతుల కోసం పోరాటం చేస్తున్నారు తెలుగుదేశం నేతలు.. అయితే జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా తన మద్దతు రైతులకి ప్రకటించారు. రాజధాని తరలించకుండా ఇక్కడే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తున్నారు, అయితే వీటిని పట్టించుకోకుండా రాజధాని విషయంలో వైసీపీ సర్కారు ముందుకు వెళ్లడం పై పవన్ కల్యాణ్ గరం అయ్యారు.
తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది..ఈ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జనసేన విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. దీంతో అందరూ షాక్ అయ్యారు.
రాజధాని రైతుల బాధలు చూడలేక వైసీపీ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేనాని హస్తిన పర్యటనకు బయలు దేరారని తెలుస్తోంది.
నేటి జనసేన సమావేశంలో అమరావతి రాజధాని తరలింపుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అమరావతిలో రైతుల పక్షాన నిలిచి, పోరాటం చెయ్యాలని జనసేన భావిస్తోంది. త్వరలోనే విజయవాడలో కవాతు నిర్వహించే అంశంపై జనసేన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. తాజాగా పవన్ కల్యాణ్ హస్తినలో కేంద్రహోం మంత్రి అమిత్ షాతో చర్చించేందుకు ఆయనతో అపాయింట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.