జగన్ నిర్ణయం పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్ నిర్ణయం పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
101

ఏపీ రాజధాని అమరావతి పై నిర్ణయం మార్చడం విశాఖ అని మొత్తం మూడు రాజధానులు అని సీఎం జగన్ చేసిన ప్రకటనపై, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ కామెంట్ చేశారు .. ఈ రాజధాని విషయంలో తెలంగాణవాదిగా సంతోషం కలిగిస్తోందని, కానీ.. భారత పౌరుడిగా బాధగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు.

ఏపీ రాజధాని గందరగోళంలో పడటం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతూ తెలంగాణకు ఆదాయం పెరిగిందని, అందుకే తెలంగాణవాదిగా సంతోషిస్తున్నానని తెలిపారు. నిన్నటివరకు సోదరుల్లాగా ఉన్నవారంతా కొట్లాడుకుంటుండటంతో భారత పౌరుడిగా బాధగా ఉందని చెప్పారు… మొత్తానికి ఏపీలో గందరగోళంగా ఉండటంతో చాలా మంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు, అయితే ఫ్లాట్ల విషయంలో హైదారాబాద్ బెస్ట్ అని అంటున్నారట… మరి తాజాగా ఆయన ఈ కామెంట్ చేయడంతో ఏపీ తెలుగుదేశం జనసేన నేతలు కూడా ఇదే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తండ్రీ కొడుకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విఫలమయ్యారని రేవంత్ ఆరోపించారు.ఇఫ్పుడు ఏ మొహం పెట్టుకొని మునిసిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కేటీఆర్ ఆస్తులు నాలుగేళ్లలో 400 రెట్లు పెరిగాయని ఆరోపించారు. మొత్తనికి మున్సిపల్ పోరు ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది.