జగన్ కు షాకిచ్చిన జయప్రద

జగన్ కు షాకిచ్చిన జయప్రద

0
85

ఏపీ రాజధాని విషయంలో ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు అని చాలా వరకూ విమర్శలు వస్తున్నాయి.. తాజాగా ఈ అంశం పై సినిమా సెలబ్రెటీలు కూడా తమ అభిప్రాయం చెబుతున్నారు.. ఏపీ రాజధాని విషయంలో ప్రజల ఇష్టానుసారమే నిర్ణయాలు ఉండాలని సీనియర్ నటి జయప్రద అభిప్రాయపడ్డారు.

అమరావతి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తనకు నచ్చడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఒక్కసారి అమరావతి రాజధాని అని చెప్పిన తరువాత, మళ్లీ మార్చడం సరికాదని అన్నారు. ఓ నిర్ణయం అప్పటి ప్రభుత్వం తీసుకుంది మళ్లీ ఎలా మారుస్తారు అని విమర్శించారు.

పాలసీస్ ప్రకారం, ప్రజల ఆలోచన ప్రకారం, వారి ఇష్టం ప్రకారం మనం చేయాలి. ఎందుకంటే, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. సో… మనం ఎన్నో ఖర్చులు పెట్టి, బయటి నుంచి వచ్చిన ఫండ్స్… ప్రజలు కూడా దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజల సుఖాన్ని చూసి నిర్ణయాలు తీసుకోవాలి” అన్నారు. మొత్తానికి జగన్ నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకించారు.