సినిక్రిటిక్ కత్తిమహేష్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కరెంట్ ఇష్యుస్ అలాగే పవన్ కళ్యాణ్ పై ఆయన అభిమానులపై సంచలన ఆరోపణలు చేస్తుంటారు… అయితే ఇదే క్రమంలో మరోసారి పవన్ పై మరో బాంబ్ పేల్చారు కత్తి…
పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సేనానిలా మారిపోయారని ఆరోపించారు… తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన కత్తి అక్కడ మీడియాతో మాట్లాడుతూ… కోస్తా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్దిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించిందని అన్నారు…
ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు… అమరావతిలో టీడీపీ పెద్దలు భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడిండ్ కు పాల్పడ్డారని కత్తి మహేష్ ఆరోపించారు…