ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు అవుతుంది అని అందరూ భావిస్తున్న వేళ మరో వార్త వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు దీనిపై స్టే ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషుల్ని ఉరితీయాల్సి ఉంది. కచ్చితంగా ఉరి అమలు అవుతుందని అందరూ అనుకున్నారు.
కాని మరో వారం సమయం ఉన్న ఈ టైమ్ లో దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు, రాష్ట్రపతికి అర్జీలు పెట్టుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే దానిని తిరస్కరించి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఢిల్లీ సర్కారు కూడా వెంటనే దానిని కేంద్ర హోంశాఖకు పంపింది.
అయితే దీనిపై ఎలాంటి తీర్పు వస్తుంది అని చూస్తున్నారు.. కాని రాష్ట్రపతి కూడా దీనిని కొట్టివేస్తారు అని అంటున్నారు.. ముఖేశ్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలు చేసి తనకు ప్రత్యేక కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ అమలు చేయరాదని వాదించారు.
నేను జారీచేసిన డెత్ వారెంటును సమీక్షించబోవడం లేదు. క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉన్నందున ఉరి అమలుపై స్టే ఇస్తున్నానంతే నాక్కావలిసిందల్లా 22న దోషుల్ని ఉరి తీయడం లేదని తిహార్ జైలు అధికారులు నివేదిక ఇవ్వడమే అని జడ్జి సతీశ్ అరోరా స్పష్టం చేశారు.
నలుగురు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్, వినయ్ శర్మలను తిహార్ ప్రాంగణంలో ఉరితీసే మూడో నెంబర్ జైలుకు గురువారం సాయంత్రం తరలించారు. కచ్చితంగా 22 న ఉరితీస్తారు అని చెబుతున్నారు కొందరు మేధావి వర్గం.