తెలుగువారు ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నగారు… నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు… పార్టీ స్థాపించిన కొద్దిరోజులకే ముఖ్యమంత్రి అయ్యారు… ఇక ఆయన బాటలోనే మెగాస్టార్ చిరంజీవి నడవాలని చూశారు…
2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.. ఎన్టీఆర్ లాగే ముఖ్యమంత్రి అవ్వాలని చూశారు… 288 చోట్ల పోటీ చేసి 18 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు… ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన చిరు చివరకు అదే పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు..
కేంద్రమంత్రి కూడా అయ్యారు… ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు అవ్వడంతో చిరుకు మంత్రిపదవి కాలం పూర్తి అయింది…రాజ్యసభ్యుడుగా ఆరేళ్లు కొనసాగారు… అయితే ఇప్పుడు తమ్ముడు కూడా అదే బేరం చేశారని సోసల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… తనకు రాజ్యసభ ఇవ్వాలని కోరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అప్పుడే తనకు ఏపీలో గ్రిప్ వస్తుందని చెప్పారట….