జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇక రాజకీయంగా బీజేపీతో కలిసి ముందుకు వెళ్లనున్నారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీతో కొనసాగిన ఆయన తాజాగా కాషాయ పార్టీకి దగ్గరయ్యారు. ఏకంగా పొత్తు పెట్టుకున్నారు. ఆయన పార్టీ బీజేపీలో కలిపేస్తున్నారు అని అనేక వార్తలు వినిపించాయి.. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్, బిజెపితో పొత్తు పెట్టుకుని ఒక స్పష్టత ఇచ్చారు. తాజాగా ఈ సమయంలో ఒక కీలక వార్త బయటకు వచ్చింది..
జనసేన కీలక నేత, సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వచ్చే ఎన్నికల వరకూ వీరిద్దరి పొత్తులు ఉంటాయి అనేది తేలిపోయింది.. స్ధానిక సంస్ధల ఎన్నికల నుంచి ఇక ఏ ఎన్నికలు వచ్చినా, ఈ కొత్త జంట కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లనుంది.
ఈ సమయంలో కేంద్రంలో మరి బీజేపీకి సపోర్ట్ ఇచ్చిన పవన్ పార్టీకి కీలక పదవి ఇస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది, ఆయనను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలో బిజెపి ఉందని టాక్ వినిపిస్తోంది. సంఘపరివార్ తో జరిపిన చర్చల్లో కూడా పవన్ ఈ విషయాన్ని ప్రతిపాదించగా వాళ్ళు కూడా అంగీకరించారని అంటున్నారు. అయితే ఆయనకు నేరుగా కేంద్రమంత్రి కాకుండా సహయమంత్రి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు… మరికొందరు మాత్రం అసలు పవన్ పార్టీ తరపున ఎంపీగా ఒక్కరు కూడా గెలవలేదు, ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చి మరీ, పవన్ పార్టీకి ఆ పదవి ఇస్తే, దేశంలో బీజేపీకి సపోర్ట్ వెన్నుదన్నుగా ఉన్న పార్టీలు కినుకువహిస్తాయి అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.