ఇక్కడ రాజధానిని నిర్మించిడం మంచిదికాదు…

ఇక్కడ రాజధానిని నిర్మించిడం మంచిదికాదు...

0
97

అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని అక్కడ రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తారని ఇక్కడ రాజధానిని నిర్మించడం మంచిది కాదని అన్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు తన బినామీలకోసమే ఆరాటం పోరాటం చేస్తున్నారని ఆరోపించారు రాయలసీమనుకరువు అనే మహమ్మారి వెంటాడుతుంటే ఏనాడైనా జోలెపట్టారా అని ప్రశ్నించారు… ఆ సమయంలో టీడీపీ నేతలు ఎందుకు చంద్రబాబు నాయుడును నిలదీయలేదని అన్నారు…

అభివృద్ది వికేంద్రీకరణ రాష్ట్రానికి అత్యవసరమని అన్నారు… గతంలో తెలుగు ప్రజల సమైఖ్య కోసం సీమ ప్రజలు కర్నూల్ రాజధానిని త్యాగం చేశారని అన్నారు… హంద్రీనివా ప్రాజెక్ట్ పనులకోసం గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు శంకుస్థాపన చేశారని కానీ తట్టెడు మట్టికూడా తీయించలేదని ఆయన ఆరోపించారు…