ఇద్దరు భార్యలపై ఓవైసీ క్లారిటీ…

ఇద్దరు భార్యలపై ఓవైసీ క్లారిటీ...

0
109

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అన్ని పార్టీల నేతలు మెజార్టీ సీట్లే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు… ఈ ప్రచారంలో వ్యక్తిగంగా విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే… తాజాగా ఎంఐఎం పార్టీ అధినేత ఓవైపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు…

ఈ ప్రచారంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం దేశంలో పొలిటికల్ మ్యారెజ్ చట్టం వచ్చిందని అన్నారు… మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ శివసేన పెళ్ళి చేసుకుంటే శరద్ పవార్ మాత్రం రిసెప్షన్ చేసుకున్నారని ఆరోపించారు…

అలాగే తనకు ఇద్దరు భార్యలు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఓవైసీ…. తాను ఒక్క భార్యతోనే పరేషాన్ అవుతుంటే ఇద్దరు భార్యలతో ఎలా వెగనని అన్నారు.. తనపై వస్తున్న వార్తలన్నీ అపద్దాలే అని కొట్టిపారేశారు… ఎంఐఎం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోందని అన్నారు ఓవైసీ..