వైసీపీ ఎమ్మెల్యే రోజాకి దివ్యవాణి కౌంటర్

వైసీపీ ఎమ్మెల్యే రోజాకి దివ్యవాణి కౌంటర్

0
89

రాజధాని మార్పు పై రగడ, రైతుల ఆందోళన సమయంలో టీడీపీ వైసీపీ జనసేన నేతల మధ్య మరింత చిచ్చుపెట్టింది, ఇరు పార్టీల నుంచి రోజుకో కామెంట్ రావడంతో వైసీపీ నేతలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పడం, దానికి మళ్లీ ఇరు పార్టీలు కౌంటర్ వేసుకోవడం, ఇలాగే జరుగుతోంది. ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు చేసే కామెంట్లు ముఖ్యమంత్రి జగన్ కు, అలాగే పార్టీకి కాస్త ఇబ్బంది తెస్తున్నాయి అని మేధావి వర్గం కూడా చెబుతున్నారు.

రాజధాని తరలింపు పై పెద్ద ఎత్తున తెలుగుదేశం కూడా విమర్శలు చేస్తోంది.. తాజాగా మహిళలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దివ్యవాణి తీవ్రస్థాయిలో విమర్శించారు, ఎమ్మెల్యే రోజా మాట్లాడే ముందు తన చరిత్ర తెలుసుకోవాలని అన్నారు, గతాన్ని మర్చిపోయారా? జగన్ జైల్లో ఉంటే ఆయన తల్లి, చెల్లి రోడ్ల మీద తిరిగి ప్రచారం చేశారని…వాళ్లు మహిళలన్న విషయం రోజాకు తెలియదా అని ప్రశ్నించారు.

రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని దివ్యవాణి హెచ్చరించారు. మహిళలపై లాఠీచార్జ్ జరిగితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.మీకు పదవులు కావాలి కాబట్టి ఎలాంటి మాటలు మాట్లాడం లేదని విమర్శించారు…రోజా మగతనాల గురించి మాట్లాడొద్దు…మేము కూడా నీలా మాట్లాడగలం..మాకు సంస్కారం ఉంది అని ఆమె అన్నారు. రాజధాని ప్రాంత మహిళలపై దాడులు జరుగుతుంటే వైసీపీ మహిళా నేతలు ఎక్కడ ఉన్నారు ఏం చర్యలు తీసుకుంటున్నారు అని ఆమె ప్రశ్నించారు.