జనసేన పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యేను అధిష్టానం సస్పెండ్ చేసింది… పార్టీ నిర్ణయాలనకు వ్యతిరేకంగా మూడు రాజధానులను సమర్ధించినందుకు ఆయనపై జనసేన వేటు వేసినట్లు తెలుస్తోంది… మూడు రాజధాన ప్రతిపాదనకు రాపాక సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు…
అలాగే గతంలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా జనసేనాని నినాదాలు చేశారు… కానీ అసెంబ్లీ సాక్షిగా రాపాక మద్దతు పలికారు… ఇప్పుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ పోరాటం చేస్తున్నారు… కానీ ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లును సమర్ధించినందుకు జనసేన పార్టీ వేటు వసేంది…
ఈమేరకు పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది… ఇక నుంచి రాపాకు జనసేనకుఎలాంటి సంబంధం లేదని ఆయన ఏం మాట్లాడినా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సొంత నిర్ణయాలు అవుతాయి తప్ప జనసేనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది…