ఆన్ లైన్ మార్కెట్ ఏది చూసినా విపరీతంగా పోటీ పెరిగిపోయింది, ఈ సమయంలో ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ఉన్నా నాలుగు అయినా వీటి మధ్య ఆపర్లు పోటీ బాగా పెరిగిపోయింది, తాజాగా జొమాటో ఉబెర్ ఈట్స్ ఈ రెండు స్వీగ్గితో పాటు పోటీ పడుతూ వ్యాపారం చేస్తున్నాయి, అయితే తాజాగా జొమాటో ఉబెర్ ఈట్స్ ని కొనుగోలు చేసింది , దీంతో ఇక జొమాటోలో ఉబెర్ కలిసిపోయింది.
ఈ డీల్ విలువ దాదాపు 2,485 కోట్ల రూపాయలని తెలుస్తోంది. జొమాటోలోని 9.99 శాతం షేర్లు ఉబెర్ పరం కానున్నాయి. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ నుంచి ఉబెర్ ఈట్స్ అంతర్ధానమైపోనుంది. అయితే ఈ డీల్ బాగానే చేసుకున్నారు వ్యాపారం కూడా బాగానే ఉంది. మరి మా దగ్గర ఉన్న కూపన్లు ఏమిటి అని డైలమాలో ఉన్నారు కస్టమర్లు.
దీంతో చాలా మంది మా దగ్గర వేల రూపాయల కూపన్లు ఉన్నాయని అంటున్నారు అవి ఏమీ పోవని అవన్నీ కూడా జొమాటోలో కంటిన్యూ అవుతాయి అని చెబుతున్నారు మార్కెట్ ప్రతినిధులు..ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో నెలకొన్న పోటీ కారణంగా ఉబెర్ ఈట్స్ తడబడిన విషయం తెలిసిందే. అందుకే జొమాటోలో కలిసింది అంటున్నారు, మొత్తానికి ఉబెర్ ఈట్స్ ని జొమాటో తినేసింది అంటున్నారు సోషల్ మీడియాలో.