బోయపాటి శ్రీనును పరామర్శించిన బాలయ్య

బోయపాటి శ్రీనును పరామర్శించిన బాలయ్య

0
82

టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరు బోయపాటి శ్రీను, ఆయన ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, అయితే ఇటీవల బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ (80) శుక్రవారంనాడు కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే చాలా మంది దర్శకులు నిర్మాతలు నటులు ఆయనని ఫోన్లో పరామర్శించారు.

అయితే ప్రస్తుతం బాలయ్య బోయపాటితో సినిమా చేస్తున్నారు, ఈ సందర్బంగా బాలయ్య బోయపాటి మధ్య మంచి రిలేషన్ కూడా ఉండటంతో, బోయపాటి ఇంటికి వెళ్లి బాలయ్య ఆయనని పరామర్శించారు.

గుంటూరు జిల్లా పెదకాకానికి ఉదయం బాలయ్య వెళ్లారు. సీతారావమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బోయపాటిని పరామర్శించి, ఓదార్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బాలయ్య విజయవాడలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు కాస్త దైర్యం చెప్పారు.