లలితా జ్యుయలర్స్ లో భారీ చోరి ఎంత దోచేశారో చూడండి

లలితా జ్యుయలర్స్ లో భారీ చోరి ఎంత దోచేశారో చూడండి

0
88

డబ్బులు ఎవరికి ఊరికే రావు అవును డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి అని చెప్పే ఆ వ్యాపారి దగ్గరే బంగారం కొల్లగొట్టేద్దాం అని ప్లాన్ వేశారు, అంతేకాదు దొరికింది కదా సందు అని 92 గ్రాములు కొట్టేసారు. తాజాగా లలితా జ్యుయలర్స్ లో భారీ చోరి జరిగింది.. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు.

జనవరి 15వతేదీ సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం 4గంటల సమయంలో గుంపుగా వచ్చిన కొందరు కస్టమర్లు కౌంటర్లో ఉన్న సేల్స్ మెన్ దృష్టి మరల్చి సుమారు. రూ. 3.5 లక్షల విలువైన 2 బంగారు గొలుసులు. ఒక బ్రాస్ లెట్ చోరీ చేశారు. ఇంటర్నల్ ఆడిట్ లో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే సీసీ కెమెరాలో వారి ఫేస్ క్లారిటీగానే ఉంది అని, ఇది పాత ముఠానా లేదా కొత్త దొంగల గుంపా తెలుసుకుని వారిని అరెస్ట్ చేస్తామని బంగారం రికవరీ చేస్తాము అని చెబుతున్నారు పోలీసులు.

పోలీసులు కూడా భారీ నగల దుకాణాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు…మరి దొంగతనం చేయాలి అని అనుకునేవాడికి అనేక దారులు అందుకే కాస్త మనం జాగ్ర్తత్తగా ఉండాలి అంటున్నారు పోలీసులు.