అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు… తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి సూమారు మూడు గంటలపాటు పలు అంశాలపై చర్చించారు…
రాష్ట్ర పరిస్ధితులపై అలాగే అర్ధిక పరిస్ధితులపై చర్చించారు… అలాగే ఫిబ్రవరి 2న అమరావతి రైతులకు అండగా వైసీపీకి వ్యకిరేకంగా తాడేపల్లి నుంచి విజయవాడవరకు కవాతు నిర్వహిస్తామని అన్నారు…
మూడు రాజధానులను కేంద్రం నమ్మలేదని పవన్ అన్నారు… అలాగే బీజేపీలో జనసేననను విలీనం చేస్తారని కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి ఈ వార్తలపై కూడా పవన్ స్పందించారు… బీజేపీలో విలీనం లేదని ఈ విషయంలో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు… అలాగే ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డిపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు…