దేశం అంతా షాక్ కు గురి అయిన ఘటన నిర్భయపై అత్యంత దారుణానికి ఒడిగట్టడం… ఇంత దారుణానికి పాల్పడిన ఈ నిందితులకు సరైన శిక్ష పడింది, నిర్భయ దోషులను ఫిబ్రవరి-1, 2020 ఉదయం 6గంటలకు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దేశం అంతా ఎప్పుడు వీరి ఉరితీత ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు, నిర్బయ తల్లి కూడా ఆ గుడ్ న్యూస్ కోసం ఏడు సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు, దీనిపై అన్ని ఏర్పాట్లు జైలు అధికారులు పూర్తి చేశారు.
ఉరికి ఇంక వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో..మీ చివరి కోరిక ఏంటి అని దోషులును తీహార్ జైలు అధికారులు అడగగా..వాళ్లు మాత్రం మౌనం వహించారు. దీంతో జైలు అధికారులు షాక్ అయ్యారు, అయితే తాము తప్పు చేశాము అని వారిలో పశ్చాత్తాపం కూడా ఏమీ కనిపించడం లేదు .
మీ ఆస్తులు లేదా కుటుంబానికి ఏమైనా చెప్పాలా అని ప్రశ్నిస్తే ఏమీ మాట్లాడలేదట, ఇక వారి కుటుంబ సభ్యులని కూడా కలుస్తాం అని కూడా చెప్పలేదట, దీంతో పోలీసులు జైలు అధికారులు షాక్ అయ్యారు.