రమేష్ పూజితకు ఇంజినీరింగ్ కాలేజీలో పరిచయం అయ్యాడు …అయితే బాగా చదువుతున్నాడు అని తెలిసి అతనితో బాగా రిలేషన్ మెయింటైన్ చేసింది , దీంతో అతను కూడా ఆమె ఏ సాయం అడిగినా చేశాడు, కాని ఓరోజు తాను ప్రేమిస్తున్నాను అని పూజితకు చెప్పాడు దీంతో ఆమె ఒప్పుకోలేదు, తనకు ప్రేమ ఇష్టం లేదు అని చెప్పింది.
అయితే తన ప్రేమ ఒప్పుకోని పూజితని పట్టించుకోకుండా రమేష్ తనపని తానుచేసుకున్నాడు, ఈ సమయంలో అతనితో మాట్లాడకుండా పూజిత ఉండలేకపోయింది, అయితే ఓరోజు తనకు ఇప్పుడు ప్రేమ ఇష్టం లేదు ముందు చదువుకోవాలి అని కోరింది కాని అతను మాత్రం ప్రేమిస్తేనే మాట్లాడతా అన్నాడు.. ఇలా రెండు మూడు రోజుల వివాదాలతో ఆమె ప్రేమని యాక్సెప్ట్ చేసింది.
అయితే రమేష్ ఆమెని వాడుకుని వదిలెయ్యాలి అని ప్లాన్ వేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన పేరెంట్స్ లేని సమయంలో ఆమెని ఇంటికి పిలిచాడు భయపడుతూ వెళ్లిన ఆమెకి కూల్ డ్రింక్ ఇచ్చాడు, అందులో అతను మత్తుమందు కలిపాడు తర్వాత లైంగిక దాడి చేశాడు, తర్వాత ఆమె జరిగింది తల్లిదండ్రులకి చెప్పడంతో అతనిపై కేసు పెట్టారు.
తన పరువు తీసింది అని పూజిత తండ్రి ఆవేదన చెందడం చూసి ఆమె సూసైడ్ చేసుకుంది.. దీంతో వెంటనే గుర్తించిన స్ధానికులు ఆమెని ఆస్పత్రికి తరలించారు అయితే ఆమె చికిత్స తీసుకుంటోంది, అయితే ఇరు ఫ్యామిలీలు మాట్లాడుకుని చదువు అయ్యాక ఇరువురుకికి వివాహం చేద్దాము అని డిసైడ్ అయ్యారట.